News Update: See Here Regarding Total Envelopes Received – https://www.tnilive.com/?p=85183
తానా 2021 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పోలీసుల పహారా నడుమ సియాటెల్‌లో శనివారం ఉదయం పకడ్బందీగా ప్రారంభమయింది. స్థానిక ఎలక్షన్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అమెరికా నలుమూలల నుండి అధ్యక్ష అభ్యర్థులు నరేన్, నిరంజన్, శ్రీనివాసలతో పాటు వారి మద్దతుదారులు, ఇతర పోటీదార్లు సియాటెల్ చేరుకున్నారు. ఈ సాయంకాలం ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. తానా 2021 ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
1. తొలుత తపాలా కార్యాలయం నుండి బ్యాలెట్లను తీసుకువస్తారు.
2. బ్యాలెట్లపై బార్‌కోడ్లను సరిచూస్తారు.
3. అనంతం మెషీన్ల సహకారంతో బ్యాలెట్లను తెరుస్తారు.
4. మెషీన్ల ఆధారంగానే లెక్కింపు జరుగుతుంది. సాయంకాలానికి ఒకేసారి ఫలితాలు విడుదల చేస్తారు.