మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతానా?
ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాల బెడద ఎక్కువైంది. ఒకరి పేరుతో, మరొకరు ఫేస్బుక్ ఖాతా తెరిచి.. ఒరిజినల్ అకౌంట్లో ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారికి కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. తీరా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక అత్యవసరం పేరుతో డబ్బులు అడగడం ఈ మధ్య ఎక్కువైంది. కరోనా వేళ నిజంగానే అవతలి వ్యక్తికి డబ్బులు అవసరం అనుకుని కొందరు పంపించి మోసపోతున్నారు. ఈ విషయం అసలు ఖాతా కలిగిన వ్యక్తికి ఆలస్యంగా చేరుతోంది. నకిలీ ఖాతా గురించి తన ఫ్రెండ్స్‌ను అలెర్ట్ చేస్తున్నారు. దీంతో పాటు నకిలీ ఖాతాను తొలగించడానికి సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
కానీ, పోలీసుల అవసరం లేకుండానే నకిలీ ఖాతాల పని పట్టొచ్చని అంటున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేయడం ద్వారా నకిలీ ఖాతాలను తొలగించొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా.. మీరు గుర్తించిన ఫేస్బుక్ నకిలీ ఖాతాకు కుడివైపు ఉన్న మూడు చుక్కల మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే సెక్షన్లో ఫేక్ అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.