తానా 2021 ఎన్నికల్లో కోశాధికారిగా కొల్లా అశోక్‌బాబు ప్రత్యర్థి జగదీష్ ప్రభలపై 1920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అశోక్‌కు 11460 ఓట్లు లభించగా, జగదీష్‌కు 9540 ఓట్లు లభించాయి. తానా ప్రతి పైసాకు పారదర్శకత ఉండేలా దాని విలువ పెంచేలా చర్యలు చేపడతానని నిరంజన్ ప్యానెల్ నుండి బరిలో దిగిన అశోక్ ఆదిలో గల్లీయువకుడని, గురువుని మించిన శిష్యుడని పెద్దస్థాయిలో గేలి చేయబడ్డారు. కుర్రాడికి ఇంకా వయస్సుందని, తానాలో పెద్ద పదవులపై ఇప్పుడే అంత మోజు ఎందుకు ప్రత్యర్థి వర్గం ప్రచారంలో విసుర్లు ప్రయోగించినా ఓటర్లు స్పష్టమైన విజ్ఞత పాటించారు. ఆయనను గెలిపించారు. టీంస్క్వేర్ లాంటి తానా ఒమెగా ప్రాజెక్టులను తన భుజస్కంధాలపై మోసి ఆపన్నులకు శోకాన్ని దూరం చేసిన అశోక్, తన పని ద్వారానే తన విజయాన్ని సంపాదించుకున్నారు. తానాకు అసలైన కార్యకర్తనని నిరూపించుకున్నారు. ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంకు చెందిన అశోక్ ప్రస్తుతం ఒహాయోలో నివసిస్తున్నారు. నరేన్ ప్యానెల్ నుండి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి ప్రభల జగదీష్ కూడా ఒహాయోలోనే నివసిస్తున్నారు. అశోక్ కన్నా తానాలో సీనియర్ అయిన జగదీష్ కూడా గెలుపుకు గట్టి కృషి చేసినప్పటకీ అశోక్ సేవా ప్రభ ఎదుట ప్రభల నిలబడలేకపోయారు. —సుందరసుందరి(sundarasundari@aol.com)
Kolla Ashok Profile: https://www.tnilive.com/2021/03/05/tana-treasurer-2021-23-candidate-kolla-ashok-babu-profile/