NRI-NRT

ఫస్ట్ బాల్‌కి సిక్సర్ కొట్టిన శశాంక్ యార్లగడ్డ

Shashank Yarlagadda Wins TANA 2021 Elections

కుర్రాడు, పెళ్లి చేసుకుని ఉద్యోగంలో జేరి జీవితం చివరి దశలో తానాలోకి వచ్చి సేవ చేయాలని ప్రత్యర్థులు విసిరిన బంతులకు సిక్సర్ కొట్టి క్రీడల సమన్వయకర్తగా యార్లగడ్డ శశాంక్ తానా 2021 ఎన్నికల్లో గెలుపొందాడు. అమెరికా పౌరుడిగా, తదుపరి తరానికి చెందినవాడిగా, క్రీడాకారుడిగా తన లాంటి తదుపరి తరానికి చెందిన వారిలో తానాలోకి తీసుకురావాలని, సేవా మార్గంలో పయనించాలని సదాశయంతో బరిలోకి దిగిన శశాంక్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని కైవసం చేసుకున్నారు. తానా ఈసీలోకి అడుగుపెట్టిన పిన్నవయస్కుడిగా రికార్డులకెక్కారు. తన ప్రత్యర్థి అనీల్ ఉప్పలపాటిపై 2161 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శశాంక్‌కు 11420 ఓట్లు లభించగా, అనీల్‌కు 9259 ఓట్లు లభించాయి.