ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో తెదేపా ముఖ్యనేతలు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు.
కత్తి లాంటి ప్రశ్న అడిగిన చంద్రబాబు
Related tags :