కొవిడ్ మూడో దశ విజృంభణలో చిన్నారులకు ఎక్కువ ముప్పు పొంచి ఉందంటూ నిపుణుల హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో పెద్దఎత్తున చిన్నారులు కరోనా బారినపడినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ జిల్లాలో 18 ఏళ్ల లోపు చిన్నారుల్లో 17,688 మందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌లో 7,760 మంది, మే నెలలో 9,928 మందికి వైరస్ సోకినట్లు జిల్లా సర్జన్ డాక్టర్ సునీల్ పోఖ్రాణా వెల్లడించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 18 ఏళ్ల లోపు వారే 8 నుంచి 10 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. ఈ గణాంకాలను జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే సైతం ధ్రువీకరించారు. కరోనా మూడో దశలో పిల్లలే అధికంగా ప్రభావితమవుతారని నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో ఈ లెక్కలు ముందు జాగ్రత్తల అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
17వేలకు పైగా చిన్నారులకు కరోనా
Related tags :