Movies

యోగనిద్ర చక్కటి పరిష్కారం

యోగనిద్ర చక్కటి పరిష్కారం

సమస్యలకు యోగనిద్ర చక్కటి పరిష్కారమార్గమని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌. కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా ఈ యోగనిద్ర ఒత్తిడిని జయించే సాధనంలా ఉపయోగపడుతుందని సూచించింది. ఆమె మాట్లాడుతూ ‘ఇదొక పురాతనమైన విద్య. పరిసరాల పట్ల స్పృహ ఉంటూనే మన అంతఃప్రపంచాన్ని, ఇంద్రియాల్ని, మనసుని ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్లడం యోగ నిద్రలో సాధ్యమవుతుంది. శ్వాసపై నియంత్రణ సాధిస్తూ శరీరం, నాడీ వ్యవస్థను అదుపులోకి తెచ్చుకోవడం ఇందులోని ప్రత్యేకతగా చెప్పవచ్చు. అర్ధగంట పాటు చేసే ఈ ప్రక్రియ ద్వారా మనందరం మానసికమైన అలజడులకు దూరంగా ఉండొచ్చు’ అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పింది. ఈ సందర్భంగా తాను యోగ నిద్రను ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.