కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు నడుస్తున్నప్పటికీ, తనకు చాలా హోంవర్క్ ఇస్తున్నారని ఓ ఆరేండ్ల బాలిక ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూమ్ వేదికగా తనకు క్లాసులు నడుస్తున్నాయని, 6, 7, 8 తరగతుల విద్యార్ధులకు ఇచ్చేంత హోంవర్క్‌ను టీచర్లు తనకు ఇస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. దీనిపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. చిన్నారి ఫిర్యాదు సమంజసమైనదేనన్నారు. స్కూల్ పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించే పాలసీని 48 గంటల్లో తీసుకురావాలని జమ్ముకశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు.
హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని మోడీకి ఆరేళ్ల బాలిక ఫిర్యాదు
Related tags :