Kids

తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు

తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు

బంగారు_తలుపులు ??

?ఒక చిన్నపాప తన తల్లిదండ్రులతో కలిసి ఒక కొండ ప్రాంతంలో నివసించేది. రోజూ తోటలో ఆడుకునే
టప్పుడు లోయకి అవతలివైపు కొండ మీద ఉన్న ఇంటిని గమనించేది.ఆ ఇంటికి ఉన్న బంగారు కిటికీ తలుపులు చూసి తను కూడా అలాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకునేది.?

?తన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఎప్పటికైనా అలాంటి బంగారు కిటికీ తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలని కలలుకంటూ ఉండేది. ఆ పాప పెద్దయిన తరువాత ఒక రోజు స్కూటర్ మీద బైటికి వెళ్ళి వస్తానని తల్లిని అడిగింది.ముందు తల్లి ఒప్పుకోలేదు కాని పాప మరీ మరీ అడగడంతో దూరంగా వెళ్ళద్దని, ఇంటికి దగ్గరలోనే తిరిగి వచ్చెయ్యమని చెప్పి పంపించింది. పాప చాలా సంతోషంగా బయలు దేరింది.?

? నెమ్మదిగా లోయకి అవతలివైపు ఉన్న ఇంటికి చేరుకుంది. స్కూటర్ ఒక పక్కగా పెట్టి ఆ ఇంటిని దగ్గరగా చూద్దామని వెళ్ళింది. అక్కడ బంగారు కిటికీ తలుపులు లేవు, పైగా అవి బాగా మట్టి పట్టి మామూలు తలుపుల కన్నా హీనంగా ఉన్నాయి.ఆ పాప నిరాశతో విచారంగా స్కూటర్ దగ్గరకు వెళ్ళింది. ?

? అక్కడనుండి వాళ్ళ ఇల్లు కనిపిస్తోంది, అది చూసిన పాప ఆశ్చర్యపోయింది, ఎందుకంటే వాళ్ళ ఇంటి కిటికీ తలుపులు బంగారురంగులో మెరుస్తున్నాయి. సూర్య కిరణాలు పడడంవల్ల తలుపులు అలా బంగారురంగులో మెరుస్తున్నాయి అని గ్రహించిది.?

?తన తల్లి తండ్రులు అన్ని సౌకర్యాలు అందిస్తూ.,
ఎంతో ప్రేమగా చుసుకుంటుంటే ఇన్నాళ్ళూ
తెలుసుకోలేకపోయినందుకు బాధపడింది.
బంగారు తలుపులు ఉన్న ఇంట్లో ఉండాలి ఆశ పడింది,కాని ప్రేమ, ఆదరణలతో నిండి ఉన్న తన ఇల్లే బంగారం అని తెలుసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరింది.?

?నీతి?

?మనిషి జీవితంలో తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు.దూరంగా ఉన్నవన్నీ బాగున్నట్టు కనిపిస్తాయి కాని దగ్గరికి వెళ్తేనే వాటి లోపాలు తెలుస్తాయి.భగవంతుడు ఇచ్చినవాటిని గౌరవిస్తూ, తృప్తిగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంది.?