DailyDose

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా-నేరవార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా-నేరవార్తలు

* స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించారు.ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్ట్రార్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది.ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కోసం బాధితుల దగ్గర సబ్ రిజిస్ట్రార్ దామోదరం రెండు లక్షలు డిమాండ్ చేయగా, ఒక లక్ష యాభై వేల తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ క్రమంలో ఇది జీర్ణించుకోలేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకు ఇచ్చి దాచమని ఇచ్చాడు.అప్పటికే బాధితుల పిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లా భక్ష్, జనార్ధన నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు. నేండ్రగుంట కు చెందిన నాని ప్రసాద్ దగ్గర నుంచి యల్లా దామోదర్ ప్రసాద్ రూ.46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు.ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేట మిట్టవద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించగా రెండు లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు.ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్నామని,రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

* ముంబయిలోని ఆశియానా టవర్​లో చెలరేగిన మంటలు.మహారాష్ట్ర ముంబయిలోని ఓ నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఒశివరా ప్రాంతంలోని ఆశియానా టవర్​లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. భవనంలోంచి భారీగా పొగ బయటకువచ్చింది.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయలు కాలేదని అధికారులు తెలిపారు.ఇది లెవల్​ 2 అగ్ని ప్రమాదంగా తెలుస్తోంది. కాగ, ఇప్పటికే 8 ఫైర్​ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు.

* హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది.పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి.పీఆర్ ఎనర్జీపై అభియోగాల నమోదుపై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది.ఈడీ కేసులపై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ ఛార్జ్‌షీట్ విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.

* ఆనందయ్య మందు పంపిణీపై తుది ఆదేశాలు సోమవారం నాడు ఇవ్వనున్నట్లు హైకోర్టు వెల్లడించింది.