కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో పనిచేసే అధికారులు, సిబ్బంది జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూ వేసుకోవద్దని, గడ్డం కూడా పెంచుకోవద్దని సీబీఐ కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ ఇకపై ఫార్మల్ డ్రెస్ మాత్రమే వేసుకుని రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీబీఐలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులు కూడా చీర, సాధారణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని రావడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, అలంకరణలతో కార్యాలయాలకు రావద్దని చెప్పారు. దుస్తుల విషయంలో ఈ నిబంధనలను అధికారులు, సిబ్బంది అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు.
సీబీఐ డ్రెస్ కోడ్
Related tags :