Politics

తిండి మానేయమని సలహా ఇచ్చిన భాజపా ఎమ్మెల్యే-తాజావార్తలు

Chattisgarh BJP MLA Asks To Stop Eating To Prevent Inflation

* ఒకవైపు పార్టీని దేశమంతా విస్తరింపజేసేందుకు భాజపా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటే.. మరొకవైపు సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాషాయ పార్టీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ద్రవ్యోల్బణం పెరుగుదల జాతీయ విపత్తని భావించేవాళ్లు తినడం.. పెట్రోలు వినియోగించడం మానేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతలు, ఆ పార్టీకి ఓటు వేసినవారు ఈ పని చేస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుంది’’ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి.

* కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో దేశంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఏర్పడడం పట్ల దిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో అందరకీ వ్యాక్సిన్‌ అందించడం ఒక్కటే ఉత్తమ మార్గమని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేషియా బయోటెక్‌కు సంబంధించిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిన్న మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హరీశ్‌రావు కూడా పలు సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీలో నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ పార్టీ ప్రయోజనాలే నాకు పరమావధి. కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్‌ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కర్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్‌ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేక సార్లు ఇదే విషయం సుస్పష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటా. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉంది ఈటల రాజేందర్‌ వైఖరి.’’

* ఏపీ సీఐడీ అద‌న‌పు డీజీకి ఎంపీ ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది లీగ‌ల్ నోటీసు పంపించారు. ర‌ఘురామ‌ను అరెస్టు చేసే స‌మ‌యంలో తీసుకున్న వ‌స్తువుల‌ను మెజిస్ట్రేట్ వ‌ద్ద జ‌మ చేయాల‌ని మంగ‌ళ‌గిరి సీఐడీ ఎస్‌హెచ్‌వోకు నోటీసు పంపారు. ఎంపీని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి మొబైల్ ఫోన్ తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. అందులో విలువైన స‌మాచారం ఉంద‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది నోటీసులో వివ‌రించారు. ఇత‌ర అంశాల‌తో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాల‌ని ఎంపీని క‌స్ట‌డీలో హింసించార‌ని న్యాయ‌వాది పేర్కొన్నారు.

* రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఈనెల 7న ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సేవలు, పలు అంశాలపై ప్రగతిభవన్‌ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువైందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు.. మహబూబాబాద్‌, భద్రాద్రి, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, గద్వాల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామని సీఎం తెలిపారు.

* ఫార్మా సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకా దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్‌ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. అంటే ఒక్కో డోసు కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

? దేశంలో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా దిగి వస్తోంది. కొత్త కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా 23వ రోజూ కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 20.84లక్షల టెస్ట్‌లు చేయగా.. దాదాపు 1.20లక్షల మందికి పైగా ఈ వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వరుసగా తొమ్మిదో రోజూ 2లక్షల కన్నాతక్కువ కేసులే నమోదు కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు 5.78శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.89శాతంగా ఉంది. ఇప్పటివరకు 36.11కోట్ల పరీక్షలు చేశారు.

? తెలంగాణలో ఎంపికచేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఈనెల 7న ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిల్లో కరోనా పరీక్షలతో పాటు మొత్తంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సేవలు, పలు అంశాలపై ప్రగతిభవన్‌ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

? మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో 1179 గ్రామాలు కరోనాలేని గ్రామాలుగా నిలిచాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 1604 గ్రామాలు ఉండగా.. 1179 గ్రామాలు కరోనా ఫ్రీ విలేజ్‌లుగా నిలిచాయని, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అయితే, 271 గ్రామాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. కరోనా విజృంభణతో నాందేడ్‌లో ఇప్పటివరకు 90వేల పాజిటివ్‌ కేసులు రాగా.. 1800 మంది చనిపోయినట్టు తెలిపారు.

? కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించేందుకు సరికొత్త రాపిడ్‌ బ్లడ్‌ టెస్టును అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో 5నిమిషాల కన్నాతక్కువ వ్యవధిలోనే శరీరంలో యాంటీబాడీలను గుర్తించవచ్చు. కరోనా సోకిన రోగుల నుంచి సేకరించిన 400 రక్త నమూనాలను ఈ పద్ధతిలో పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంతో యాంటీబాడీలను గుర్తించిందని తెలిపారు. ఇది బ్లడ్‌ గ్రూప్‌ తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్షలాగే ఉంటుందట. రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, స్టేడియాల్లో ప్రజలను పరీక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

? కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్‌ వేవ్‌తో సతమతమవుతున్న భారత్‌కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 36,50,080 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 టీకా డోసులు పంపిణీ జరగ్గా.. ఇంకా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.65కోట్ల మేర డోసులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అలాగే, రాష్ట్రాలకు ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను సమకూర్చినట్టు (రాష్ట్రాలు నేరుగా సేకరించుకున్నవాటితో కలిపి) వివరించింది.

? తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ ఈ నెల 14వరకు కొనసాగిస్తున్నట్టు సీఎం స్టాలిన్‌ వెల్లడించారు. అత్యధిక పాజిటివిటీ రేటు కలిగిన 11 జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయనుండగా.. మిగతా జిల్లాల్లో సడలింపులు ఇస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, దిల్లీలోనూ కరోనా అదుపులోకి రావడంతో అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టారు. మార్కెట్లు, మాల్స్‌ను సరి బేసి పద్ధతిలో తెరవాలని సీఎం కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ప్రైవేటు కార్యాలయాలకు 50శాతం సిబ్బందితో అనుమతిస్తున్నట్టు చెప్పారు. మరిన్ని సడలింపులతో జూన్‌ 14వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కరోనా కర్ఫ్యూని జూన్‌ 14వరకు పొడిగించారు. అలాగే, 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా కర్ఫ్యూని ఈ నెల 15వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

? హైదరాబాద్‌కు చెందిన హెటెరో గ్రూపు రష్యాకు చెందిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వి’ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో హెటెరో గ్రూపు కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో హెటెరో సంస్థకు ఆర్‌డీఐఎఫ్‌ నుంచి స్పుత్నిక్‌ వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడంతో ‘స్పుత్నిక్‌ వి’ టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్‌ బి.పార్థసారధి రెడ్డి తెలిపారు. స్పుత్నిక్‌ వి టీకాతో పాటు స్పుత్నిక్‌ లైట్‌ టీకానూ ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 20 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి, స్పుత్నిక్‌ లైట్‌ టీకాల ఉత్పత్తికి వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.

? ఫార్మా సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకా దేశంలోనే అత్యంత చౌకైన వ్యాక్సిన్‌ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. అంటే ఒక్కో డోసు ధర కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.

? కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 4500 మంది ఖైదీలకు పెరోల్‌ను పొడిగిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 60 రోజుల పాటు పెరోల్‌ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరగడంతో తాజాగా మరో 30 రోజుల పాటు ఆ గడువును పెంచుతున్నట్టు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం పెరోల్‌పై ఉన్న ఖైదీలు జైలుకు వస్తే మిగతా వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, జైలులో ఉన్న ఖైదీలందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 18వేల మంది ఖైదీలకు వ్యాక్సిన్‌ వేసినట్టు చెప్పారు.

? వ్యాక్సినేషన్‌ విషయంలో పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వినూత్న చర్యలు చేపట్టింది. ‘వ్యాక్సినేషన్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట మార్కెట్ల వద్ద ప్రత్యేక ఏసీ బస్సులతో మొబైల్‌ వ్యాక్సినేషన్‌ సర్వీసు ఏర్పాటు చేసింది. మొబైల్‌ క్లీనిక్‌ తరహాలో ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లోనే రవాణా సిబ్బందితో పాటు కూరగాయలు విక్రయించేవారు, నిత్యావసరాలు, చేపలు అమ్మేవారు, తదితరులకు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నీలోఫర్‌ ఆసుపత్రిని చిన్నారుల కరోనా చికిత్స కోసం నోడల్‌ కేంద్రంగా మార్చనున్నట్టు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, ఓఎస్‌డీ గంగాధర్‌, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సీఎస్‌ ..నీలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించారు. పసి పిల్లలకు కొవిడ్‌ సోకితే చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

* తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌ని.. అందుకే సీఎం పోలీస్ శాఖ‌కు అధిక‌ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలోని ఆసిఫ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ నూత‌న భ‌వనాన్ని మ‌హ‌మూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, సీపీ అంజ‌నీకుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. అధునాత‌న సౌక‌ర్యాల‌తో క‌మాండ్ అండ్ కంట్రోల్ రూం నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు.

* బెయిల్‌ రద్దవుతుందన్న అనుమానంతోనే సానుభూతి కోసం కేంద్రంపై పోరాడుతున్నట్టు సీఎం జగన్‌ బలం కూడగడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ…సీఎం జగన్‌ అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం లేఖ రాసినప్పుడు వారించిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు పక్క రాష్ట్రాల సీఎంలతో బలం కూడగడుతున్నారని ప్రశ్నించారు.