కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ పోస్ట్ ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. మృతిచెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కరోనా ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. దీంతో పోస్టల్ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
గంగానదిలోకి అస్తికల స్పీడ్ పోస్ట్

Related tags :