Business

1984లో లీటర్ పెట్రోల్ 07. 2024కి 125.

1984లో లీటర్ పెట్రోల్ 07.

1984 లో లీటర్ పెట్రోల్ 07
1994 లో లీటర్ పెట్రోల్ 21
2004 లో పెట్రోల్ లీటర్ 37
2014 లో పెట్రోల్ లీటర్ 78
2021 లో పెట్రోల్ లీటర్ 100
2024 కి పెట్రోల్ లీటర్ 125 (అంచనా )

మన దేశం లో 1990 దశకం లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు పుణ్యమా అని ప్రజలు యొక్క కొనుగోలు శక్తి పెరిగింది..

దాని ఫలితంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఇండ్లలో ప్రతి ఇంటికి ఒక సైకిల్ స్థానం లో ఒక మోటర్ సైకిల్ వచ్చింది..

ఒక లీటర్ 70 Km ఇచ్చే హీరో హోండా నుంచి ప్రారంభం అయ్యి అనేక రకాలు మోటర్ సైకిల్ లు ప్రజలు కొనుగోలు చేశారు..

చిల్లర సమస్య కావచ్చు, లేదా వినియోగదారుడు మిగులు అనే భావన ప్రభావం కావచ్చు జనాలు పెట్రోల్ నీ లీటర్ లలో కొనటం మానేసి రూపాయిలు లో కొనటం మొదలు పెట్టారు..

ఎక్కువ మంది మోటర్ సైకిలు వాడే వారు పెట్రోల్ బంక్ కి వెళ్లి 100,200, 500 లేదా ఫుల్ టాంక్ పెట్రోల్ కొట్టిస్తు ఉంటారు..

(గత 10 లేదా 15 ఎండ్లలో మీరు గానీ మీకు తెలిసిన వాళ్ళు గానీ పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ అని కొట్టించిన వాళ్ళని చూసారా ?? )

జనాలు లీటర్ల లో కొనటం మానేసి రూపాయిలు లో పెట్రోల్ కొనటం మొదలు పెట్టారో అది పాలకులు కి అయిచిత వరం లాగా మారింది..
2004 వరకు మన దేశం లో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి ఏటా బడ్జెట్ లోనే నిర్ణయించే వారు

2004 నుంచి 2017 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి 15 రోజులు కి ఒకసారి సవరణ చెయ్యటం మొదలు పెట్టారు..

2017 నుంచి పెట్రోల్ డీజిల్ పై డైలీ ప్రైసింగ్ అమలు లోకి వచ్చింది.
సంవత్సరం లో 365 రోజులు ఉంటే సుమారు 300 రోజుల పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంటుంది

ఇందాక ఒక మాట చెప్పాను వినియోగదారుని మిగులు అని అంటే
ఒక వస్తువు కి వెచ్చించే ధర కంటే ఆ వస్తువు నుంచి అధిక ప్రయోజనం దక్కటం వినియోగదారుని మిగులు..

2004 లో 100 కి మూడు లీటర్లు పెట్రోల్ వస్తె సగటున 150 కిలోమీటర్లు బండి నడిపేవారు సో 100 కొట్టిస్తే 3 రోజులు వచ్చేది రోజుకి 30 పెద్ద ఇబ్బంది లేదు.

2014 లో 100 కి 1.30 లీటర్లు పెట్రోల్ వచ్చేది 100 పోయిస్తే 100 కిలోమీటర్లు కిలోమీటర్ కి రూపాయి
సంతృప్తి స్థాయి మిగులు భావన వర్క్ అవుట్ అయినాయి.. రెండు రోజులు వచ్చేది..

2021 లో పెట్రోల్ డీజిల్ 90 దాటిన దగ్గర నుంచి 100 పోయిస్టే ఒక్క రోజే వస్తోంది అది 50 కిలోమీటర్లు

ఇప్పుడు రోజు కి 100 లేనిది బండి బయటకి తియ్యలేము.. పట్టణ ప్రాంతాలు లో రోజు కి 50 కిలోమీటర్లు సర్వ సాధారణంగా తిరుగుతారు..

రోజు 100 సమర్పించాలి ఒక్కప్పుడు 1000 రూపాయిలు ఉన్న నెల పెట్రోల్ బడ్జెట్ ఇప్పుడు 3000 నుంచి 4000 మధ్యలోకి మారింది..

ఇప్పుడు లీటర్లు లో కొనాలి అన్న రూపాయిలు లో కొనాలి అన్న నొప్పి తెలుస్తోంది..అందుకే పెరుగుతున్న పెట్రోల్ ధరలు మీదా సామాజిక మాధ్యమాలు లో విపరీతంగా ట్రోల్లింగ్ లు నడుస్తున్నాయి..

మీరు ఇక్కడ వరకు చదివారు అంటే దానికి కారణం పెట్రోల్ డీజిల్ ధరలు మి పై చూపించిన ప్రభావం..

రూపాయిలు లో కొంటున్న జనాలు కి నొప్పి తెలియ కండ వుండాలి అంటే ఏమి చెయ్యాలి ??

ఈ పరిస్థితి మన పాలకులు ముందే ఊహించారు..

అందుకే వారు 200 నోటు జారీ చేశారు..

ఏ చిల్లర సమస్య వలన అయితే జనాలు పెట్రోల్ లీటర్లు లో కొనటం మానేసి రూపాయిలు లో కొనటం మొదలు పెట్టారు కదా .

ఇప్పుడు 100 రెండు మూడు రోజులు తరవాత 102 అవుతుంది 100 పోయిస్తే లీటర్ రాదు
లీటర్ పోయిద్ధం అంటే రెండు రూపాయిలు చిల్లర ఉండదు

ఇప్పుడు జనాలు కి ఉన్న ఆప్షన్ 150 లేదా 200 కొట్టించటం మొదలు పెడతారు..