ScienceAndTech

ఫోన్ రిపేర్‌కు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. యాపిల్‌కు భారీ జరిమానా.

ఫోన్ రిపేర్‌కు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. యాపిల్‌కు భారీ జరిమానా.

రిపేర్‌ సెంటర్‌లోని ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి యాపిల్‌ సంస్థ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రిపేర్‌కు వచ్చిన ఫోన్‌లోని వ్యక్తిగత చిత్రాలను అక్కడి టెక్నీషియన్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యవహారంలో బాధితురాలికి కొన్ని కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించింది. తాజాగా ‘టెలిగ్రాఫ్‌’ అనే ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంతో కాలిఫోర్నియాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఒరెగాన్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి తన యాపిల్‌ ఫోన్‌ రిపేర్‌కు రావడంతో 2016లో సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లింది. పెగట్రాన్‌ సంస్థ ఆ సర్వీస్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఫోన్‌ రిపేర్‌ చేసే క్రమంలో అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫోన్‌లోని ఆమె వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను ఆన్‌లైన్‌లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న యువతి ఆ ఫొటోలను తొలగించింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో యాపిల్‌ సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చింది.