* దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు లక్షకు దిగిరాగా, 2,427 మరణాలు సంభవించాయి. గత 25 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య 14లక్షలని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలకు సడలింపులు ప్రకటిస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో 68.4శాతం కొత్త కేసులు..నిన్న నమోదైన కరోనా కొత్త కేసుల్లో ఐదు రాష్ట్రాల వాటానే 68.4 శాతంగా ఉంది. తమిళనాడులో అత్యధికంగా 20,421 కేసులు వెలుగుచూడగా, కేరళలో 14,672, మహారాష్ట్రలో 12,557, కర్ణాటకలో 12,209, ఆంధ్రప్రదేశ్‌లో 8,976 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.89కోట్ల మందికి పైగా కరోనా సోకింది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 14 రోజులుగా 10శాతానికి దిగువనే ఉండటం ఊరటనిచ్చే విషయం.
* 18 సం . దాటిన వారికి జూన్ 21 నుంచి వ్యాక్సిన్ దేశంలో 18 సం . దాటిన వయోజనులకు ఈ నెల 21 నుంచి ఉచితంగా ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు . ఏ రాష్ట్రమూ వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు . ఉచితంగా వ్యాక్సిన్ వద్దనుకుంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రధాని తెలిపారు . కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టం చేశారు .
* ఏపీ ప్రభుత్వం 07 – 06 – 2021.జిల్లాల వారీగా:అనంతపురం – 535, చిత్తూరు – 961, తూర్పుగోదావరి జిల్లా – 810, గుంటూరు – 374, కడప – 404,కృష్ణాజిల్లా – 175, ,కర్నూలు – 212, నెల్లూరు – 232, ప్రకాశం – 447, విశాఖ – 189, విజయనగరం – 207, పశ్చిమ గోదావరి జిల్లా – 160, శ్రీకాకుళం జిల్లా – 166.టోటాళ్ – 4,872.
* కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపీణీ సవ్యంగా సాగట్లేదు.పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదు.విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేదు.ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదు.ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధం అందిస్తాం.ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధం అందిస్తాం.కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోంది.స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావద్దు- ఆనందయ్య
* ఏపీ రాష్టంలో కరోనా కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు.