* ఏపీలో కరోనా కేసులు.రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు, 77 మరణాలు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 14,641 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 కరోనా యాక్టివ్ కేసులు.రాష్ట్రంలో 24 గంటల్లో 89,732 మందికి కరోనా పరీక్షలు.
* ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్మోహన్‌రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించాలని ఆనందయ్య కోరారు.అలాగే ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని కోరారు.ఎక్కువ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు.మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు.సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది.నేడు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో నేడు మందు పంపిణీ చేయనున్నారు.గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేయించనున్నారు.
* దేశ ప్రజలందరికీ టీకా ఉచితంగా అందిస్తామని చెప్పిన కేంద్రం ఇందుకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జనాభా, వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ పురోగతి అంశాల ఆధారంగా టీకా డోసుల పంపిణీ ఉంటుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది.టీకా వృథా అధికంగా ఉంటే డోసుల పంపిణీపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది.తమకు అందిన డోసులను బట్టి.. టీకా ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.జూన్ 21 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని తెలిపింది.టీకా పంపిణీకి సంబంధించి రాష్ట్రాలకు ముందుగానే సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి టీకా ధరను తయారీదారులే నిర్ణయిస్తారని కేంద్రం వెల్లడించింది.ఒక్కో డోసుకు రూ.150కి మించకుండా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవచ్చని పేర్కొంది.
* కొవిడ్ మూడో ముప్పు (Covid third wave) దృష్ట్యా ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.ఐదేళ్లలోపు చిన్నారుల తల్లుల జాబితాను సిద్ధం చేయాలని వైద్యారోగ్య శాఖ (ap health department) అధికారులను ఆదేశించింది.45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్ వేయాలన్న నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది.ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతోంది.వ్యాక్సినేషన్ ముందురోజే ఆశా వర్కర్లు, ఎఎన్ఎమ్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది.
* ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్దితో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు లాగా.. ఆయన బాబు లాగా… అందరికీ తండ్రులు లేరు.లోకేష్ తండ్రికి దొరికినట్లు.. అందరికీ వాళ్ల పిల్లలను చదివించేందుకు సత్యం రామలింగరాజు లాంటి వ్యక్తులు దొరకరు.పరీక్షల విషయంలో ఎందుకు వారు రాజకీయం చేస్తున్నారో అర్థం కావటం లేదు.పరీక్షలు నిర్వహించి ఏదో ఒక రకంగా విద్యార్థులకు గ్రేడిండులు ఇవ్వాలనే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకుంటోందన్నారు.తగ్గించిన సిలబస్‌లతో ఇప్పటికే పరీక్షలకు ప్రశ్నాపత్రాలు కూడా రూపొందించామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.