Agriculture

ఖరీఫ్ కనీస మద్దతు ధర పెంపు

ఖరీఫ్ కనీస మద్దతు ధర పెంపు

2021-22 ఏడాదికి ఖరీఫ్​ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

క్వింటా ధాన్యం ధరను రూ.72 పెంచి రూ.1,940గా నిర్ణయించింది. గతేడాది ఈ ధర రూ.1,868 ఉండేది.

అలాగే క్వింటా నువ్వుల కనీస మద్దతు ధర రూ.452 మేర పెంపునకు ఆమోదం తెలిపింది

కేబినెట్​. క్వింటా కంది, మినుముల కనీస మద్దతు ధర రూ.300 మేర పెంచింది.

రైల్వేలకు 5 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్​ కేటాయింపునకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

స్పెక్ట్రమ్​తో సమాచార, సిగ్నల్​ వ్యవస్థ మరింత మెరుగవుతుందని మంత్రి ప్రకాశ్​​ జావడేకర్​ తెలిపారు.

ఇది ప్రయాణికుల భద్రత, రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.

అలాగే రానున్న ఐదేళ్లలో సిగ్నల్​ ఆధునికీకరణ, 5జీ స్పెక్ట్రమ్​ను​ అందుబాటులోకి తెచ్చేందుకు రూ.25,000 కోట్లు కేటాయించింది కేంద్రం.