DailyDose

మా ఆస్తులు అతడు అక్రమంగా దోచుకున్నాడు-నేరవార్తలు

MP Nusrat Jahan Says Nikhil Jain Stole Their Assets

* ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి.ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను, సర్వీస్ నుంచి తప్పించాలి.మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టుతీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి.సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్‍కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారు.సునీల్ పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి హోంశాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎల్‍ఆర్‍వో కన్వీనర్ ఎన్‍ఐ జోషి డిమాండ్.

* కొవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్సు దాడులు కొనసాగుతున్నాయి.

* నిఖిల్​ జైన్​తో సంబంధం గురించి కొనసాగుతున్న వివాదంపై మౌనం వీడారు నటి, తృణమూల్​ కాంగ్రెస్​ నేత నుస్రత్​ జహాన్.నిఖిల్​తో తనకు టర్కిష్​ చట్టం ప్రకారం వివాహం జరిగిందని, అయితే ఇది భారత్​లో చెల్లదని ఓ ప్రకటనలో తెలిపారు నుస్రత్​.ఈ క్రమంలోనే నిఖిల్​ జైన్​పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్​.తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను నిఖిల్​ అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు.తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని నిధులను దుర్వినియోగం చేశారన్నారు.

* కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

* విజయనగరం..యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పార్వతీపురం పోలీసులు..తనను బెదిరించి లోబరుచుకున్నారంటూ పార్వతీపురం పోలీసులకు యువతి పిర్యాదు చేసింది.తనను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నారని యువతి పోలీసులకు తెలిపింది..ముగ్గురు యువకులపై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.