ఒక నల్లగుడ్డు తింటే మీ ఆయుష్షు ఏడేళ్లు పెరుగుతుంది. రెండు తింటే 14 ఏళ్లు జీవితకాలం పెరిగినట్టే! ఇంతకీ ఆ గుడ్డు ఎక్కడ దొరుకుతుంది? ఆ విశేషాలు ఇవి…
జపాన్‌లోని హకోన్ అనే ప్రాంతంలో గ్రేట్ బాయిలింగ్ వ్యాలీ ఉంది. మూడువేల ఏళ్ల క్రితం ఏర్పడిన ఒక అగ్నిపర్వతం వల్ల ఈ బాయిలింగ్ వ్యాలీ ఏర్పడింది.ఈ వ్యాలీలో బాయిలింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ నీటిలో సల్ఫర్ అధిక శాతం ఉంటుంది. పూల్స్‌లో నీళ్లు పొగలు కక్కుతూ ఉంటాయి. ఆ ప్రాంతమంతా టూరిస్టులతో సందడిగా ఉంటుంది. అయితే పర్యాటకులు వచ్చేది బాయిలింగ్‌పూల్స్‌ను చూసేందుకు మాత్రమే కాదు. ఆ పూల్స్‌లో ఉడికించిన గుడ్లను తినడానికి!సల్ఫర్ అధికంగా ఉన్న నీటిలో ఉడికించడం వల్ల గుడ్ల పెంకు నల్లగా మారుతుంది. ఇంకో విశేషమేమిటంటే ఈ గుడ్డు తింటే ఏడేళ్లు ఆయుష్షు పెరుగుతుందని స్థానికులు చెబుతుంటారు. వాటికోసమే పర్యాటకులు కిలోమీటర్ మేర ట్రెక్కింగ్ చేసి బాయిలింగ్ పూల్స్‌కు చేరుకుంటారు.
ఒక నల్లగుడ్డు తింటే ఏడేళ్ల ఆయుస్షు పెరుగుతుందంట
Related tags :