కరోనా మహమ్మారి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టింది.. పెడుతోంది. కొందరి ప్రాణాలు తీసుకెళ్లిపోయింది. మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్ వరకు వెళ్లి ఎలాగోలా ప్రాణాల్ని కాపాడుకున్నవారు ఉన్నారు. ఇంత వరకు మందు కనిపెట్టని ఈ మహమ్మారితో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నటి హంసానందిని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే హంసానందిని.. ఈ మధ్య కొన్నాళ్లు.. అస్సలు అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కూడా కరోనా బారిన పడినట్లుగా భావించారు. నెటిజన్లు భావించినట్లుగానే.. తనే కాకుండా తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా హంసానందిని తెలిపింది. దాదాపు 25 రోజుల పాటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత.. క్షేమంగా ఇంటికి చేరుకున్నామని.. హంసానందిని ట్వీట్ చేసింది. ఈ 25 రోజులు నరకం చూశామని, బతుకుతామనే ఆశను కూడా కోల్పోయామని చెబుతూ.. దేవుడి దయ, స్నేహితుల, బంధువుల ప్రార్థనలతో, డాక్టర్ల సహకారంతో మళ్లీ క్షేమంగా బయటపడ్డామని హంసానందిని తెలిపింది. అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చాలా తీవ్రమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందని గమనించాలని హంసానందిని కోరింది.
బతుకుతామనుకోలేదు
Related tags :