Business

టాప్-అప్ లోన్ గురించి విన్నారా?-వాణిజ్యం

టాప్-అప్ లోన్ గురించి విన్నారా?-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో లాభ నష్టాల మధ్య ఊగిసలాడినా వెంటనే పుంజుకుంది. మిడ్‌ సెషన​ తరువాత మరింత ఎగిసిన సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయిం‍ట్లు జంప్‌ చేసింది. చివరికి సెన్సెక్స్‌ 359 పాయింట్లు ఎగిసి 52300 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15737వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, పార్మా జోరు మార్కెట్‌కు ఊతమిచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్స్‌ రికార్డ్‌ స్థాయిలకు చేరాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, కార్పొరేషన్‌, విప్రో, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్‌, గ్రాసిం , సిప్లా అరబిందో, లుపిన్‌; దివీస్‌, గ్లెన్‌మార్క్‌, బయెకాన్‌ లాభాల్లో ముగిసాయి. మరోవైపు ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ముగిసాయి.

* తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్‌ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్‌.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ‘ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో కూడిన జిఫిరస్‌ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్‌ 5900హెచ్‌ఎస్, 5900హెచ్‌ఎక్స్‌ ప్రాసెసర్లతో కూడిన ఆర్‌ఓజీ ఫ్లో ఎక్స్‌ 13 ల్యాప్‌టాప్‌ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌ఓజీ జెఫిరస్‌ డ్యూయో 15 ఎస్‌ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది.

* తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను తితిదే అధికారులు ప్రారంభించనున్నారు.

* నిధుల కొర‌త వ‌ల్ల ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నారా? ఇంటి కొనుగోలు కోసం ఇప్ప‌టికే బ్యాంకులో అప్పు తీసుకున్నారా? మ‌ళ్లీ ఇప్పుడు అప్పు కోసం క్రెడిట్ కార్డు లేదా వ్య‌క్తిగ‌త రుణం తీసుకుందామంటే వ‌డ్డీ భారం అవుతుంద‌ని ఆలోచిస్తున్నారా? అయితే మీ ముందు మ‌రో ఆప్ష‌న్ కూడా ఉంది. అదే టాప్‌-అప్ హోమ్‌ లోన్‌.ఇతర వినియోగదారుల మాదిరిగానే, ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు కూడా.. అదే ఇంటిపై మ‌రోసారి రుణం తీసుకోవ‌చ్చు. ఇంటి పున‌ర్నిర్మాణం, విస్త‌ర‌ణ, పిల్ల‌ల చ‌దువులు, కారు కొనుగోలు వంటి వాటికి ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. రుణ‌దాత‌లు ఈ ఆర్థిక‌ అవ‌స‌రాల‌ను గుర్తించి తుది వినియోగ ప‌రిమితులు లేకుండా ఇప్ప‌టికే గృహం రుణం పొందిన వారికి టాప్‌-అప్ లోన్ ఇవ్వ‌డం ప్రారంభించారు.