* ఒంగోలులో పోటాపోటీగా ఆనందయ్య మందు పంపిణీ.మంత్రి బాలినేని ఇంట్లో ఆనందయ్య మందు పంపిణీ.పీవీఆర్ హైస్కూల్‌లో మందు పంపిణీ చేసిన ఎంపీ మాగుంట.ఆనందయ్య తయారు చేసిన పి.రకం మందు పంపిణీ చేస్తున్న నేతలు.
* వృద్ధులకు రెండ్రోజుల్లో వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ ఆదేశం.ఆధార్ లేకపోవడం వలన వృద్ధులకు వ్యాక్సిన్ వేయడం లేదన్న పిటీషన్‌పై విచారణ.సోమవారం నాటికి వ్యాక్సిన్ వేస్తామన్న ఏపీ ప్రభుత్వం.
* రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ ఊపిరి పీల్చుకుంది.ఇవ్వాళ్టి నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్నాయి.దీంతో సాయంత్రం 6 గంటల వరకు యథావిధిగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ సంస్థ పేర్కొంది.నగరంలో 12 వందల బస్సులతో పాటు జిల్లాకు 3,600 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.లాక్ డౌన్ సడలింపులతో ప్రయాణికులతో బస్టాండ్లు మళ్లీ కళకళ లాడుతున్నాయి.
* ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు.గురువారం వరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది.ఈ రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది.రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఉండబోతోంది.