Devotional

అనంతపురం లేపాక్షి విశేషాలు

అనంతపురం లేపాక్షి విశేషాలు

ప్రపంచానికి తెలియని అద్భుతాన్ని మీకు అందిస్తున్నాను. 
అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం
గురించి మీకు కొన్ని విషయాలే తెలిసి ఉండవచ్చు. వాటిలో..
⚡?⚡?⚡?⚡?⚡?
1. అతిపెద్ద నంది విగ్రహం,
2. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించే సమయంలో లేపాక్షిలో పడిన సీతమ్మ తల్లి అడుగు,
3. ఆలయ నిర్మాణానికి నిధులను వృధా చేశారని వీరణ్ణ, విరూపణ్ణ ల కళ్ళు పీకివేసి, గోడకు విసరగా, ఇప్పటికీ అలాగే ఉన్న రక్తపు మరకలు,
4. అతిపెద్ద రాతిపడగలను కలిగి ఉన్న శివలింగం
5. వజ్రాలను పొడి చేసి, వాటితో గీసిన కుడ్య చిత్రాలు
6. సైనికులకు రాతి పళ్లెంలో భోజనాలు
7. ఆ నాటి ప్రాచీన తెలుగు లిపి
8. స్త్రీ ఆకారాన్ని బట్టి వారు ఏ జాతికి చెందిన వారో తెలియజేసేలా వారి శిల్పాలు
9. ఇక అందరికీ కుతూహలాన్ని కలిగించే “వ్రేలాడే స్తంభం”!
దేవాలయ సందర్శనకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఈ స్తంభాన్ని చూసి, స్తంభం క్రింద ఓ వస్త్రాన్ని పోనిచ్చి, అది నేలను త్రాకడం లేదని సంబరపడిపోతారు.
ఈ స్తంభం గాల్లో ఎలా నిలబడిందా అని ఆశ్చర్యపోతారు.
కానీ, ప్రపంచానికి తెలియని ఓ అద్భుతం..
“Stone Levitation”(సాహితి స్మృతి)
అంటే అంతర్గత గురుత్వాకర్షణ కారణంగా ఈ స్తంభం క్రింద నేలను, పైకప్పునూ తాకకుండా గాల్లోనే నిలబడి ఉండుట!
అంతేకాదు! అలా గాల్లోకి నిలబడి ఉన్న ఈ స్తంభాన్ని పట్టుకుని త్రిప్పితే, భ్రమణాలు చేసేది. ఈ అద్భుతాన్ని కనుగొనడానికి అప్పట్లో ఓ బ్రిటిష్ అధికారి శతవిధాలా ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆ కోపంలో స్తంభాన్ని స్థానభ్రంశం చేయించడానికి ప్రయత్నించగా, మొత్తం దేవాలయం అంతా కదిలిపోయింది. భయపడ్డ బ్రిటిష్ అధికారి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బ్రిటిష్ వాడు చేసిన ఈ పనికిమాలిన చేష్ట కారణంగా దురదృష్టవశాత్తు, స్తంభానికి క్రింది వైపున ఒక భాగం నేలను త్రాకింది. ఈ విషయం చాలామందికి తెలియదు. అందరూ ఈ స్తంభానికి పైకప్పుతో attachment ఉంటుంది అనుకుంటారు. కానీ, ఈ స్తంభానికి పైనా, క్రిందా ఎటువంటి ఆధారం ఉండేది కాదు. విదేశీయుడి దుశ్చర్యకు ఈ అద్భుతం ఒకవైపు నేలకొరిగింది. 
లేపాక్షిని సందర్శించినపుడు ఈ అద్భుతాన్ని తిలకించండి!