Business

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ₹100-వాణిజ్యం

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ₹100-వాణిజ్యం

* పెట్రోల్​ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్​ శుక్రవారం దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది.దేశ రాజధాని దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు పెట్రోల్​ బంకుల వద్ద నిరసన తెలిపారు.”యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. పెట్రోల్​, డీజిల్​పై పన్ను రూ.9.20గా ఉండేది. కానీ ప్రస్తుతం అది రూ.32గా ఉంది.పెట్రోల్​, డీజీల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మేం డిమాండ్​ చేస్తున్నాం.ఇంధన ధరలను కూడా జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావాలి,” అని దిల్లీలో కాంగ్రెస్​ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

* దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. వరుస పెంపులతో చుక్కలను తాకుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు లీటర్‌ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102 దాటింది. ఇక దిల్లీలో రూ. 95.85కి చేరింది. లీటర్‌ డీజిల్ ధర ముంబయిలో రూ. 94.14, దిల్లీలో రూ. 86.75గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.100కు చేరువైంది. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, లద్దాఖ్‌లోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ జిల్లాలో ఏకంగా రూ. 106.94కు చేరింది. దేశంలో ఇదే అత్యధికం. ఈ ప్రాంతంలో డీజిల్‌ ధర కూడా వంద రూపాయలకు చేరువై రూ. 99.80గా ఉంది. మే 4 నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అప్పటి నుంచి 23 సార్లు ధరలను సవరించగా.. పెట్రోల్‌పై రూ.6 వరకు పెరగడం గమనార్హం. వ్యాట్‌, స్థానిక పన్నులను బట్టి చమురు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.

* సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు జులై 1 నుంచి మారనున్నాయి. నెఫ్ట్‌/ఆర్టీజీఎస్‌/ఐఎంపీఎస్‌ మార్గాల ద్వారా నగదు లావాదేవీలకు ఇకపై కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా సిండికేట్‌ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. దీంతో కెనరా బ్యాంక్‌ నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది.

* దేశంలో ఇళ్ల ధరలు 2020 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 1.6 శాతం మేర తగ్గాయని నైట్‌ ఫ్రాంక్‌ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా గృహాల ధరల్లో వార్షిక వృద్ధి ఎలా ఉందనే అంశంపై నైట్‌ ఫ్రాంక్‌ రూపొందించిన నివేదికలో భారత్‌కు 55వ స్థానం లభించింది. స్థిరాస్తి ధరలు 32 శాతం పెరగడంతో, ఈ నివేదికలో టర్కీ అగ్ర స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో భారత్‌ 55వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 56వ స్థానంలో స్పెయిన్‌ నిలిచింది. గత మార్చిలో విడుదల చేసిన నివేదికలో 56వ స్థానంలో ఉన్న భారత్‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 2020 తొలి త్రైమాసికంలో 43వ స్థానంలో ఉండగా, తాజాగా 12 స్థానాలు కోల్పోయింది. స్పెయిన్‌లో 1.8 శాతం ధరలు క్షీణించగా, భారత్‌లో 1.6 శాతం మేర క్షీణించినట్లు నివేదిక తెలిపింది.