* వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో ని గెస్ట్ హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న ఐదవ రోజు సీబీఐ విచారణ..
* గుంటూరు జిల్లాలోని ప్రజలు వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ , ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చిన ప్రకటనలను చూసి మోసపోవద్దని రూరల్ పోలీసులు హెచ్చరించారు .
* అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది.అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ బెంచ్ తీవ్రంగా స్పందించింది.అగ్రిగోల్డ్ కంపెనీ ప్రతిపాదనకు అంగీకరిస్తే మరో ఇరవై ఏళ్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది.అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన సవరించిన ప్రతిపాదనలపై సమాధానం ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువగా ఆంధ్రాలో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని న్యాయస్థానం పరిశీలిస్తోంది.
* వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళ్తున్న వైఎస్ షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు ఆపారు. పరిగిలో ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు షర్మిల హైదరాబాద్ నుంచి వెళ్తుండగా పూడూరు మండలం అంగడిజితెంపల్లి గేటు వద్దకు రాగానే పోలీసులు ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అనుమతులకు మించి వాహనాలు కాన్వాయ్‌లో ఉండటంతో వాటిని పక్కకు నిలిపేశారు. అనంతరం ఐదు వాహనాల చొప్పున అనుమతించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.