క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐటీ–హైదరాబాద్ 591వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్–200 స్థానాల్లో మన దేశానికి చెందిన మూడు జాతీయస్థాయి విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–బాంబే 177వ ర్యాంకు, ఐఐటీ–ఢిల్లీ 185వ ర్యాంకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) 186వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఐఐఎస్‌సీ బెంగళూరు పరిశోధన అంశంలో ప్రపంచంలో నంబర్1 స్థానాన్ని సాధించింది. ఈమేరకు ప్రధాని మోదీæ బెంగళూర్ ఐఐఎస్‌సీతో పాటు ఐఐటీ–బాంబే, ఐఐటీ–ఢిల్లీ సంస్థలను అభినందించారు. ఇక ఐఐటీ – మద్రాస్ 255వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 277వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 280వ ర్యాంకు, ఐఐటీ–గువాహతి 395వ ర్యాంకు, ఐఐటీ రూర్కీ 400వ ర్యాంకు సాధించాయి. ఢిల్లీ యూనివర్శిటీ 501–510 మధ్య, జేఎన్‌యూ–ఢిల్లీ 561–570 మధ్య, ఐఐటీ–హైదరాబాద్ 591–600 మధ్య, సావిత్రీబాయ్ ఫూలే పుణె వర్సిటీ 591–600 మధ్య నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 651–700 మధ్య నిలిచింది. ఐఐటీ–భువనేశ్వర్, ఓపీ జిందాల్ గ్లోబ్ యూనివర్సిటీ 701–750 మధ్య, పాండిచ్చేరి యూనివర్సిటీ 801–1000 మధ్య, బిట్స్ పిలానీ, ఉస్మానియా యూనివర్సిటీ, వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూర్ సంస్థలు 1001–1200 మధ్య స్థానాల్లో నిలిచాయి. ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1200 పైన నిలిచింది. జాతీయస్థాయిలో చూస్తే ఐఐటీ–హైదరాబాద్‌కు 11వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 14వ స్థానం, ఉస్మానియా వర్సిటీకి 30వ స్థానం దక్కాయి.
ఐఐటీ హైదరాబాద్‌కు 591 ర్యాంకు
Related tags :