బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు విషయంలో ఎన్‌సీబీ చుట్టూ తిరుగుతున్న ఆమెకు ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చిందని బాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇది పురాణ ఇతిహాసమైన మహాభారతం ప్రేరణగా రూపొందనున్న ఈ చిత్రంలో రియా చక్రవర్తి ద్రౌపదిగా కీలక పాత్ర పోషించనుందట. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథ ఈ పాత్ర విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. తాజాగా రియా ‘చెహ్రే’ చిత్రంలో నటించింది. కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.
ద్రౌపదిగా రియా
Related tags :