తొలి రెండు సెట్లు పోయాయ్ ఇంకేం గెలుస్తాడులే అనే ఆలోచనలు! సిట్సిపాస్‌దే టైటిల్ అనే అంచనాలు! తర్వాత సెట్లోనే మ్యాచ్ అయిపోతుందేమో అన్ తలపులు! కానీ బరిలో ఉంది జకోవిచ్! ఎన్ని చూసుంటాడు.. ఎన్ని ఆడుంటాడు! ఒక్క అవకాశం…! అన్నట్లుగా కనిపించిన ఈ సెర్బియా యోధుడు ఆ ఛాన్స్ దొరకగానే చెలరేగిపోయాడు.. పాయింట్ పాయింట్‌కు బలాన్ని పెంచుకుంటూ.. ప్రత్యర్థిని బలహీనుడిగా మారుస్తూ కప్ ఎగరేసుకుపోయాడు! ఫ్రెంచ్ కోటలో మరోసారి తన జెండాను పాతేశాడు! టైటిల్ నం.19 సాధించేశాడు! కెరీర్లో అతడికిది రెండో ఫ్రెంచ్ ఓపెన్. 2016లో అతడు తొలిసారి ఈ టైటిల్ గెలిచాడు. జకో అదరహో! ఏమా ఆట.. ఏమా పోరాటం! ఓటమి తప్పదా అన్న స్థితి నుంచి అసాధారణంగా పుంజుకున్న ఈ సెర్బియా స్టార్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయకేతనం ఎగురవేశాడు. ఆదివారం నాలుగు గంటలకు పైగా నువ్వానేనా అన్నట్లు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో అయిదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. తొలిసారి ఫైనల్‌కు వచ్చిన స్టెఫానోస్కు గట్టిగానే పోరాడినా నిరాశ తప్పలేదు.
టెన్నిస్ ప్రియులను అలరించడంలో ఆరితేరిన జకో
Related tags :