Health

అధికారులు 100శాతం హాజరు కావాలి-TNI కోవిద్ బులెటిన్

అధికారులు 100శాతం హాజరు కావాలి-TNI కోవిద్ బులెటిన్

* కరోనా ఉద్ధృతి నుంచి దేశ రాజధాని దిల్లీ దాదాపు కుదుటపడింది. లాక్‌డౌన్‌ సహా, ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 14వ తేదీ నుంచి రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని అయితే, 50శాతం సామర్థ్యంతోనే వాటిని నడపాలని అన్నారు. అదే విధంగా మున్సిపల్‌ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇవి కాకుండా పాఠశాలలు, కాలేజ్‌లు, విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, సినిమా హాళ్లు, మల్టీపెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, వ్యాయామశాలలు, పార్కులను ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ మూసే ఉంచాలని ఆదేశించారు. నగరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలను తెరుచుకోవచ్చని, అయితే సందర్శకులకు అనుమతి ఇవ్వరాదని అన్నారు. మార్కెట్లు, మాల్స్‌ సరి, బేసి విధానంలో మాత్రమే తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్‌-ఏ అధికారులు 100శాతం హాజరు కావాలి. మిగిలిన వాళ్లు 50శాతం విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనిచేయాలి. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 20మందికి మించి ఉండరాదు. ఢిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో పనిచేస్తాయి. ప్రజా రవాణా ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్స్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. మ్యాక్సీ క్యాబ్‌లో 5గురు, ఆర్‌టీవీలో 11మంది ప్రయాణించవచ్చు. అంతరాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాలకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమతులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.

* దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80,834 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 71 రోజుల్లో అత్యంత తక్కువ రోజువారీ పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 2,94,39,989కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,303 మంది కోవిడ్‌ పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,70,384 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,32,062 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,80,43,446 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,26,159 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 25.31 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ అందించారు.

* తిరుపతి పద్మావతి హాస్పిటల్ లో ఆందోళనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా…కోవిడ్, బ్లాక్ ఫంగస్ పెషేంట్స్ కు సరైన వైద్యం అందలేదని పెషేంట్స్ బంధువులు ఆందోళన…ఈ ఘటనపై చిత్తూరు జిల్లా డంహో డాక్టర్ శ్రీహరి, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని…కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ను అదేశించిన మంత్రి ఆళ్ల నాని…రోగుల బంధువులతో ఆందోళన విరమించి వారికి అవసరమైన సహకారం అందించాలని తిరుపతి ఋడో కనక నరసారెడ్డి ని అదేశించిన మంత్రి ఆళ్ల నాని…వాయల్పాడు మండలం తనికిరి గ్రామనికి చెఒ దిన కరోనా పెషేంట్ వినోద్ మే నెల 29న తిరుపతి పద్మావతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు…తీవ్రంగా లంగ్స్ సమస్య ఉండడంతో వెంటిలేటర్ పై వైద్యం అందించిన హాస్పిటల్ వైద్యులు…ఆక్సిజన్ లెవల్స్ 36కు ఉండడం వల్ల వైద్యులు ఎంత ప్రయత్నం చేసిన వినోద్ ఆరోగ్యం క్షిణించడంతో ఆదివారం తెల్లవారు జామున మృతి చెఒ దాడు…మరో బ్లాక్ ఫంగస్ కేసు జయమ్మ మే 25న పద్మావతి హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది…బ్లాక్ ఫంగస్ తో ఇబ్బంది పడుతున్న జయమ్మకు నిరంతరం వైద్యం అందిస్తున్న వైద్యులు…ఆమె ఆరోగ్యం క్షిణించడం వల్ల జయమ్మ ఈరోజు ఉదయం తీవ్ర అనారోగ్యంతో మృతి చెదారు…పద్మావతి హాస్పిటల్ లో సీనియర్ వైద్యులు ఎప్పటికప్పుడు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని మంత్రి ఆళ్ల నానికు ఫోన్ లో వివరించిన చిత్తూరు డంహో డాక్టర్.శ్రీహరి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్.రామ్…కరోనా రోగులకు ఆహారం, శానిటేషన్ విషయంలో ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని సూపరింటెండెంట్ ను అదేశించిన మంత్రి ఆళ్ల నాని.