Movies

సహనం…శారీరక శ్రమలే కారణం

సహనం…శారీరక శ్రమలే కారణం

కొవిడ్‌ నుంచి కోలుకొని సాధారణ జీవితం గడపాలంటే కాస్త సమయం పడుతుందని చెప్పింది అగ్ర కథానాయిక కత్రినాకైఫ్‌. మానసిక ధైర్యంతో పాటు సహనం ఉంటేనే ఈ మహమ్మారి వల్ల కలిగే శారీరక అలసట నుంచి ఉపశమనం పొందుతామని పేర్కొంది. ఏప్రిల్‌ నెలలో ఆమె కరోనా బారిన పడి కోలుకుంది. ఈ సందర్భంగా కరోనా అనంతరం తన ఆరోగ్య పరిస్థితి గురించి కత్రినాకైఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత అంతా బాగుందని ఫీలవుతాం. కానీ ఒక్కోసారి శరీరాన్ని అలసట ఆవహించిన భావం కలుగుతుంది. శారీరక మార్పుల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఆందోళన చెందకుండా అలసట నుంచి బయటపడే మార్గాల గురించి ఆలోచించాలి. నేను యోగాతో పాటు శారీరక వ్యాయామం ద్వారా కరోనా అనంతర సమస్యల నుంచి తేరుకున్నా’ అని చెప్పింది. యువహీరో విక్కీకౌశల్‌తో ఈ భామ ప్రేమాయణం సాగిస్తోందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ప్రేమాయణం ప్రస్తుతం హిందీ చిత్ర వర్గాల్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.