రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలు పాటించని పక్షంలో ఇప్పటివరకూ ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులను ఉపసంహరింస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు.
‘‘ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసులను తగ్గించగలిగాం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా అదుపులోకి వచ్చింది. కానీ..సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు’’ అంటూ సీఎం ప్రజల కోసం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తమిళనాడులో లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా ప్రభుత్వం సడలిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి పెరగకూడదనే ఉద్దేశ్యంతో సీఎం ఈ హెచ్చరిక చేశారు.