Movies

డ్రగ్స్ కేసులో మరో నటి అరెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటి అరెస్ట్

డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ద‌క్షిణాది న‌టి నైరా షాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డ్ర‌గ్స్ వాడుతున్నార‌న్న స‌మాచారంతో ముంబై జుహూలోని హోట‌ల్ రూంలో ఎన్సీబీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టి..నైరా షాతోపాటు ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. సిగ‌రెట్స్ లో చుట్ట‌బ‌డి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపారు. ఉద‌యం 3 గంట‌ల‌కు చేప‌ట్టిన త‌నిఖీల్లో ఇద్ద‌రి ద‌గ్గ‌ర గ్రాము గంజాయిని గుర్తించిన‌ట్టు తెలిపారు. ఆదివారం రాత్రి నైరా షా పుట్టిన‌రోజు. హోట‌ల్ లో పార్టీ అనంత‌రం గంజాయి తీసుకున్న‌ట్టుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. నైరా షా తెలుగులో బుర్ర క‌థ చిత్రంలో న‌టించింది.