ఇంజినీరింగ్ విద్యార్థులకు మరింత నైపుణ్యత చేకూర్చేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నది. అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ (ఎంఎల్) నేర్చుకోవడానికి ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలో ఉద్యోగాలు సంపాదించడానికి సహాయపడటం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అని తెలిపింది. దీని ద్వారా భవిష్యత్‌లో నైపుణ్యాల కోసం పెరుగుతున్న డిమాండ్ నెరవేరుతుందని అమెజాన్ ఇండియా భావిస్తున్నది. ఎంఎల్ సమ్మర్ స్కూల్ అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా జరుగుతుంది. 2021 లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ ఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) బొంబాయి, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తిరుచిరాపల్లి, అన్నా యూనివర్శిటీ సాంకేతిక ప్రాంగణాల యూజీ, పీజీ లేదా పీహెచ్‌డీ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు డీప్ లెర్నింగ్, ప్రాబబిలిస్టిక్ గ్రాఫికల్ మోడల్స్ వంటి ఉన్నత స్థాయి ఎంఎల్ టెక్నాలజీలను నేర్చుకుంటారు. దీని ద్వారా ఈ-కామర్స్, డిమాండ్ అంచనా, క్యాటలాగ్ నాణ్యత, ఉత్పత్తి సిఫార్సులు, ఆ
భారతీయ విద్యార్థులకు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ పాఠాలు
Related tags :