ఒకప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఆ పిల్లలకు చిన్న కథలు చెప్పి మాటలు చెప్పి ఏడుపు మాన్పించేవారు
మొండి చేస్తున్న పిల్లలకు పక్షులను వీధిలో వెళ్లే చిన్న చిన్న జంతువులను చూపించి ఆ వైఖరిని మార్చేవారు
అన్నం తినిపించాలంటే కథలు
నిద్ర పుచ్చాలంటే అమ్మమ్మ తాతయ్య కథలు చెప్పేవారు
ఇంకా ఎక్కువ మారాం చేస్తే నాలుగు పడితే దారిలోకి వచ్చేవాళ్ళు
ఇప్పుడేమో పిల్లలకు ఈ సెల్ల్ఫోన్ ని బాగా అలవాటు చేసారు
ఇప్పుడేమో దేనికైనా ఆ ఫోనే
బిడ్డ ఏడిస్తే ఫోన్
అన్నంతినాలంటే ఫోన్
నిద్రపోవాలన్నా ఫోన్
ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే క్షణాల్లో ఏడుపు ఆపేస్తారండి
మారం చేయకుండా తినేస్తారండి
ఫోన్ చూస్తూ నిద్ర పోతారండి అని
ఇలా అన్ని మీరే అలవాటు చేసి పిల్లలు చెడిపోవడానికి కారణం ఫోన్ అనిఎంత తేలికగా చెప్పేస్తారండి
ఆ తప్పు ఫోన్ అలవాటు చేసిన మీది కాదా ???
టెక్నాలజీ ఎంత మారిందంటే
మంచిని చూపెడుతుంది
చెడును చూపెడుతుంది
ఎంచుకునే మనలోనే ఉంది మనం మంచి మార్గంలో నడుస్తామా లేక చెడిపోతామా అని
పిల్లలకు సాధ్యమైన అంత వరకు కాదు అసలు ఫోన్ ఇవ్వకండి
పిల్లలకు ఫోన్ కొనివ్వడం ఇప్పటి పెద్దలకు ప్రెస్టేజ్
మానుకోండి మొదట మీరు ఈ ఆలోచన తీరును
మారం చేస్తున్నారా ఏడుస్తున్నారా వారికీ దగ్గరగా కూర్చుని మాటలు కలపండి
కథలు వినిపించండి
ఒక స్కూల్ లో ఇద్దరు పిల్లలు
ఒక పాపా మరో పాపతో మా నాన్న నాకు పెద్ద లాప్టాప్ కొనిచ్చారు అందులో కథలుంటాయి ఆటలుంటాయి పాటలుంటాయి అని చెప్పింది
నీదగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆ చిన్నారి ఇవన్నీ నాకు చెప్తూ పాడుతూ ఆడుతూ మా నాన్న నా దగ్గరే ఉన్నారు అని చెప్పింది
ఎంత ఆనందం ఆ మాట
తాత్కాలిక ఆనందం మీ పిల్లలకు ఇవ్వకండి
కొట్టడమో తిట్టడమో ప్రేమించడమే పక్కనే ఉండి తియ్యనైన జ్ఞాపకాలను మీ పిల్లలకు జీవితాంతం గుర్తుండేలా ఇవ్వండి
అవి వారి పిల్లలకు సైతం మధురమైన స్మృతులుగా అందిస్తారు
ఒక్కసారి ఆలోచించండి
నేటి ఈ పోటీ ప్రపంచంలో కుదరదు అని చెప్పకండి
ఏదైనా ఈ పోటీని మనం సృష్టించిందే మనకంటే గొప్పదైతే కాదు కదా.