DailyDose

పులివెందులలో కాల్పులు. ఇద్దరు మృతి-నేరవార్తలు

పులివెందులలో కాల్పులు. ఇద్దరు మృతి-నేరవార్తలు

* పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసిపి కి చెందిన రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

* సెల్ ఫోన్ స్టేటస్ లో పెట్టిన ఫోటో కారణంగా కత్తులతో దాడి చేసుకున్న యువకులు. నూజివీడు మండలం లీలానగర్ కాలనీకి చెందిన ఇరువురు యువకులను కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఐదుగురు వ్యక్తులు. మొబైల్ ఫోన్ స్టేటస్లో తను తీసుకున్న మోడరన్ ఫోటో అప్ లోడ్ చెయ్యటమే వివాదానికి కారణమని తెలిపిన గాయపడ్డ యువకుడు. తీవ్ర గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

* అరాచకం అనేది వైసీపీ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

* కేరళకు చెందిన మత్స్యకారులను చంపిన ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాదళ అధికారులపై నమోదైన క్రిమినల్ కేసు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఎఫ్‌ఐఆర్‌ సహా కేసు విచారణను రద్దుచేసింది.భారత్ ఆమోదించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ అవార్డు ప్రకారం కేసు విచారణను రిపబ్లిక్ ఆఫ్ ఇటలీ చేపడుతుందని తెలిపింది.ఇటలీ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిన రూ. పదికోట్ల పరిహారంపై సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. మృతుల కుటుంబీకుల పేరుమీద నాలుగుకోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఆదేశించింది.మిగిలిన రెండుకోట్ల రూపాయలను బోటు యజమానికి చెల్లించాలని పేర్కొంది.2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ ఎంవీ ఎన్‌రికా లెక్సీ అధికారులు.. ఇద్దరు భారతీయ మత్స్యకారులను కాల్చి చంపారు. ఈ ఘటన భారత పరిధిలోని ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో జరిగింది.