DailyDose

ఆ పోస్ట్‌మాస్టర్ దంపతులు చనిపోయారు-నేరవార్తలు

ఆ పోస్ట్‌మాస్టర్ దంపతులు చనిపోయారు-నేరవార్తలు

* అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన దంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి..ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో ఘటన..ఆత్మహత్యకు పాల్పడిన పొట్టిపాడు పోస్ట్ మాస్టర్ దోమ.రఘుబాబు దంపతులు..చికిత్స పొందుతూ రఘుబాబు నిన్న మరణించగా..భార్య రాణి ఈ రోజు ఉదయం మృతి చెందారు..ఇటీవల పలు ఆరోపణలపై సస్పెండ్ అయిన పోస్టు మాస్టర్ రఘుబాబు..కుటుంబ అవసరాల దృష్ట్యా స్వగ్రామమైన పొట్టిపాడులో పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు గడవు కోరిన రఘుబాబు..సత్వరమే చెల్లించాలని వడ్డీ దారులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం..పెద్దఅవుటపల్లిలోని జోసఫ్ తంబి గుడి లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రఘు దంపతులు..స్థానికుల సమాచారంతో బాధితులను ఆసుపత్రికి తరలించిన ఆత్కూరు పోలీసులు..విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతి..కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ఆత్కూరు పోలీసులు..ఈ నెలలో రఘుబాబు తిరిగి విధుల్లోకి చేరనున్న నేపధ్యంలో చోటుచేసుకున్న ఘటన.

* కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్‌ యూనిస్‌ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ప్రమాదకర పదార్థాలతో నింపిన బెలున్లను గాజా నుంచి వదులుతున్నారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పేర్కొంది. ఈ బెలున్ల కారణంగా దేశంలోని పలు చోట్ల నిప్పు అంటుకొందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ఫైర్‌ సర్వీస్‌ కూడా ధ్రువీకరించింది. 20 అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకొన్నట్లు పేర్కొంది.

* గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన పదిమంది దుర్మరణం.

* విశాఖజిల్లాలోని కొయ్యూరు మండలంలో ఎదురుకాల్పులు.పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.పోలీస్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు మృతి.కొవ్వూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు.గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న కాల్పులు.సంఘటనా స్థలంలో ఎకే 47 ఎస్ఎల్ఆర్, తపంచ ఇతర సామాగ్రి స్వాధీనం.ఎదురు కాల్పుల్లో తెలంగాణ వాసి గంగయ్య మృతి.డీసీఎం కమాండర్గా ఉన్న సంధ్య గంగయ్య.