బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు పంపింది. ఎంపీకి చెందిన మధుకాన్ సంస్థతో పాటు, గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ ఇటీవల రెండు రోజుల పాటు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా భారీగా నగదు, దస్త్రాలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్టు మధుకాన్ గ్రూప్‌పై ఈడీ అభియోగం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బ్యాంకులకు “నామా”లు
Related tags :