* ‘గ్రీన్ ఫంగస్’ రోగి ఇండోర్ నుండి ముంబైకి విమానంలో ప్రయాణం…భారతదేశంలో బహుశా ఇదే మొదటి కేసు…ఇండోర్‌లోని 34 ఏళ్ల వ్యక్తిలో అరుదైన ‘గ్రీన్ ఫంగస్’ ఇన్‌ఫెక్షన్…మరో అరుదైన గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నియంత్రణలో భాగంగా చికిత్స కోసం అతనిని ముంబైకి తరలింపు.
* కరోనా వైరస్ మహమ్మారి దాటికి వణికిపోయిన అగ్రరాజ్యం అమెరికా…ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, కొవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం, వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో మహమ్మారి నుంచి విముక్తి పొందినట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో జులై 4న జరిగే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మహమ్మారిపై అమెరికా విజయం సాధించిందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* కొవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది.ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ఆధార్ లేకుండా వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.రాష్ట్రంలో 2,357 బ్లాక్‌ఫంగస్ కేసులు, 175 మరణాలు నమోదయ్యాయని వివరించారు.ప్రస్తుతం 1,385 కేసులు క్రియాశీలంగా ఉన్నాయని.. అంఫోటెరిసిన్-బి ఇంజక్షన్ల సరఫరాలో కొరత ఉందని వెల్లడించారు.వారానికి 8-10 వేలకు మించి ఇంజక్షన్లు రావట్లేదని.. డిమాండ్‌కు తగ్గట్లు ఇంజక్షన్లు కేంద్రం సరఫరా చేయట్లేదని తెలిపారు.బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత తీవ్రతను కోర్టు అమికస్ క్యూరీ దృష్టికి తీసుకువెళ్లారు.
* దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 62,224 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2542 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 1,07,628 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.దీంతో రికవరీ రేటు 95.80 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసులు: 29,633,105…మొత్తం మరణాలు: 3,79,573..కోలుకున్నవారు: 2,83,88,100..యాక్టివ్ కేసులు: 8,65,432…దేశవ్యాప్తంగా టీకా పంపిణీ వేగంగా సాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మంగళవారం 28,00,458 టీకా డోసులు అందించగా మొత్తం 26,19,72,014 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. తాజాగా 19,30,987 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.కరోనా మహమ్మారి కర్కశత్వానికి ఈ ఏడాది మే నెలలో భారత్‌లో రోజుకు వేల సంఖ్యలో రోగులు కన్నుమూశారు.