రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందుగా రిజర్వేషన్ చేయించుకోకపోయినా, టికెట్ తీసుకోకపోయినా కూడా నిరభ్యంతరంగా రైలు ఎక్కవచ్చు. కేవలం ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటే చాలు. ట్రైన్‌లోకి ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. చివరి నిమిషంలో హడావిడిగా రైల్వే స్టేషన్‌కు వచ్చి హైరానా పడనవసరం లేకుండా భారతీయ రైల్వే ఈ వెసులుబాటు కల్పించింది.
రిజర్వేషన్ లేకుండా స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అక్కడి టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరిన లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. యూటీసీ యాప్ ద్వారా లేదా స్టేషన్లలోని వెండింగ్ మెషిన్ల ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటే చాలు. దానితో రైలు ఎక్కేయవచ్చు. ట్రైన్ ఎక్కిన తర్వాత దానిని టీటీఈకి చూపించి టికెట్ తీసుకోవచ్చు. అంతేకాదు సీట్లు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ చేయించుకుని బెర్త్ కూడా సంపాదించవచ్చు