DailyDose

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు -నేరవార్తలు

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు -నేరవార్తలు

* కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో భగ్గుమన్న ఫ్యాక్షన్…గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టిడిపి నాయకుల దారుణ హత్య. గ్రామానికి చెందిన వడ్డు నాగేశ్వర రెడ్డి , ఆయన సోదరుడు వడ్డు ప్రతాప్ రెడ్డిలను వేట కొడవళ్ళు కత్తులతో నరికి చంపిన దుండగులు.

* దేశరాజధాని దిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్వర్జెన్స్‌ బ్లాక్‌లో మంటలు చెలరేగాయి.

* ఎస్సీ యువకుడిపై చేయి చేసుకున్న ఇబ్రహీంపట్నం మహిళ ఎస్ఐ మణి. తీవ్ర పదజాలంతో దూషణ. విచారణకు సీఐ ఆదేశాలు.

* పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. అక్కడి నుంచి మదనపల్లె బయల్దేరారు.

* గుంటూరు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న ఇద్దరి వ్యక్తుల పైకి దూసుకెళ్లింది.

* చల్లపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..పచ్చార్లంక సమీపంలో మూడు పల్టీలు కొట్టిన కారు.కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు సమాచారం.ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..ఇద్దరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.