Sports

పీవీ సింధుకు ఉచితంగా రెండెకరాలు-తాజావార్తలు

పీవీ సింధుకు ఉచితంగా రెండెకరాలు-తాజావార్తలు

* తన మద్దతుదారులను వేధిస్తున్నారని.. అలా చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారని అన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా? అని నిలదీశారు. 2024 ఎన్నికలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఒక రిహార్సల్‌ లాంటిదన్నారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజూరాబాద్‌ వేదిక అయిందని.. రేపటి నుంచి ఇంటింటికీ వెళ్తానని ఈటల స్పష్టం చేశారు.

* ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖ రూర‌ల్ మండలంలోని చినగ‌దిలి వద్ద సర్వే నంబరు 72, 83 పరిధిలో రెండెక‌రాల భూమిని కేటాయించింది. ఈ మేరకు పీవీ సింధుకు కేటాయించిన భూమిని పశుసంవర్థక, యువజన సర్వీసులు, క్రీడా శాఖకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూమిని ఉచితంగానే కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* అల్లు స్నేహ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్‌లో ఏ హీరో భార్యకు లేనంత మంది ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఇన్‌స్టాలో ఆమె 4 మిలియ‌న్స్‌కి పైగా ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నారు.

* నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో కొందరు హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. స్థానికంగా పెళ్లి జరుగుతున్నఇంట్లోకి ప్రవేశించి ఏకంగా 50 వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. అంత మొత్తంలో డబ్బులు పెళ్లి వారు ఇవ్వకపోవడంతో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బట్టలు విప్పి హిజ్రాలు నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా పెళ్లి వారిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

* లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఎంపీలు చిరాగ్‌ పాశ్వాన్‌, పశుపతి పరాస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్‌ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్‌ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీశ్‌ కుమార్‌ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్‌, ఎంపీ ప్రిన్స్‌రాజ్‌ పాశ్వాన్‌(రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌ తనయుడు) సైతం తమ అంకుల్‌ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్‌ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు.

* భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ జాన్‌ తాంసన్‌ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

* విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్షించిన సీఎం.. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

* స్కూళ్లు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని.. ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంలో ఒక్క స్కూల్‌ కూడా మూతపడ్డం లేదని.. ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తీసేయడం లేదని సీఎం తెలిపారు. రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

* ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుకూల మీడియాపై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దుమ్మెత్తిపోశారు. ‘‘ఒక దురుద్దేశ భావనను నిజం అని చూపించడానికి బాబు అను‘కుల’ మీడియా చేస్తున్న కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా ఉంటున్నాయని’’ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో సీఎం జగన్ గారు చేసిన అభ్యర్థనలను కేంద్రం తిరస్కరిస్తే బాగుండనే దుర్మార్గపు ఆలోచనలను ఏమనాలి అంటూ ఆయన ప్రశ్నించారు. అలా అనుకోవడం ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవడమేనని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

*