Politics

జగన్ అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్‌దాస్ పాత్ర-నేరవార్తలు

జగన్ అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్‌దాస్ పాత్ర-నేరవార్తలు

* నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో దారుణం. ఆత్మకూరు టౌన్ లోని ఏ సి ఎస్ ఆర్ కాలనీ లో నివసించే ఓ ప్రేమజంట తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట. వేరువేరు కులాలకు చెందిన వీరిరువురి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడి చనిపోయిన ప్రేమ జంట.

* ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింవద్దని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్‌ కేంద్ర పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి లేఖ రాశారు.కేంద్ర ఉద్యోగ శాఖ ఆధ్వర్యంలో ఉండే ఈ విభాగం కింద అఖిల భారత సర్వీసు ఉద్యోగులు ఉంటారు.ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆదిత్యనాథ్‌ నిందితునిగా ఉన్నారని, ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచి సీఎం జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సాయం చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి అయిన ఇండియా సిమెంట్స్‌కు లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా పది లక్షల లీటర్ల నీటికి కేటాయించారన్నారు.ఇలాంటి వ్యక్తిని అదే పదవిలో కొనసాగిస్తే ప్రజావ్యవస్థలపై నమ్మకం పోతుందని, అలాగే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు.ఆదిత్యనాథ్‌ ఈనెల 30వ తేదీన రిటైర్‌ కావాల్సి ఉంది.

* మాజీమంత్రి దేవినేని ఉమపై మైలవరం పోలీస్‌స్టేషన్‌లో కొవిడ్‌ కేసు నమోదైంది. ఈనెల 16న చేపట్టిన ఒక కార్యక్రమంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

* తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. సుమారు రూ.6 కోట్లు విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.4 కోట్లు విలువైన 20 టన్నుల పత్తి, రూ.2 కోట్లు విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.

* ఎవరైనా వినోదం కోసం యూట్యూబ్‌ చూస్తారు లేదా విద్యను అభ్యసించేందుకు చూస్తారు. కానీ, ఓ వ్యక్తి యూట్యూబ్‌లో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుని కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌చెరువు జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజుప్రసాద్‌ అలియాస్‌ రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దొంగ నోట్ల చెలామణి మొదలుపెట్టాడు. పఠాన్‌ చెరువు, మండవల్లి, ఏలూరు, బాచుపల్లి, సంగారెడ్డిలో దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక కూడా బుద్ధిమారని రాజుప్రసాద్‌ ఓఎల్‌ఎక్స్‌లో కలర్‌ ప్రింటర్‌ కొనుగోలు చేసి, దానిని ఉపయోగించి రెండు వేల రూపాయల నోట్లు ముద్రించాడు. అందులో నుంచి.. ఇస్నాపూర్‌లోని చెప్పుల దుకాణంలో ఓ నోటును మార్చిన రాజు… కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్‌లో నకిలీ నోట్లు మారుస్తూ పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి 14 నకిలీ రెండువేల రూపాయల నోట్లు, కలర్‌ ప్రింటర్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.