Health

భారతీయ నదుల్లో కరోనా ఆనవాళ్లు-TNI బులెటిన్

భారతీయ నదుల్లో కరోనా ఆనవాళ్లు-TNI బులెటిన్

* రాష్ట్రంలో కొత్తగా 6,341 కరోనా కేసులు, 57 మరణాలు.కరోనా నుంచి కోలుకున్న మరో 8,486 మంది బాధితులు.ప్రస్తుతం 67,629 కరోనా యాక్టివ్‌ కేసులు.24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు.కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి.ప్రకాశం జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో ఆరుగురి మరణం .తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,244 కరోనా కేసులు నమోదు.చిత్తూరు జిల్లాలో 937, పశ్చిమ గోదావరి జిల్లాలో 647 కరోనా కేసులు.

* కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

* దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

* న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ శుక్రవారం ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు.

* గుంటూరు జిల్లాలోని ఐఎంఏ అసోసియేషన్ హల్ వద్ద వైద్యులు నిరసనకు దిగారు.

* కరోనా టీకా వేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై ఓ కుటుంబం దాడి చేసింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ బందీపొరా జిల్లాలోని జెబాన్​ చుంటిముల్లా అనే గ్రామంలో గురువారం జరిగింది.

* కరోనా యోధుల కోసం కస్టమైజ్డ్​ క్రాష్ కోర్స్​ ప్రోగ్రామ్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.26 రాష్ట్రాల్లో 111 శిక్షణ కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారు.దీని ద్వారా లక్ష మందిలో పని సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వనున్నారు.

* అహ్మదాబాద్​లోని సబర్మతీ నది, కంకరియా, ఛందోలా సరస్సుల్లో కరోనా వైరస్​ ఆనవాళ్లను గుర్తించారు కొందరు ఐఐటీ నిపుణులు.గాంధీనగర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీష్ కుమార్ సహా 8 ఇతర సంస్థల నిపుణులు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని నివేదించింది ఐఐటీ గాంధీనగర్.సబర్మతీ నది నుంచి 18 సార్లు, కంకరియా, ఛందోలా సరస్సుల నుంచి 16 సార్లు నీటి శాంపిళ్లను సేకరించినట్లు మనీష్ తెలిపారు.నాలుగు నెలల్లో మొత్తంగా ఐదు రోజులు ఈ నీటి శాంపిళ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.అయితే.. నీటిలో గుర్తించిన ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వెల్లిడించారు. అది ‘డెడ్​ వైరస్​’ అని స్పష్టం చేశారు.ఈ వైరస్​తో భయాందోళనకు గురికావొద్దని చెప్పినప్పటికీ.. ఈత కొలనులకు వెళ్లకపోవడం మంచిదని మనీష్ సూచించారు.