DailyDose

నారా లోకేశ్‌పై కేసు నమోదు-నేరవార్తలు

నారా లోకేశ్‌పై కేసు నమోదు-నేరవార్తలు

* సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ పై కేసు నమోదు. కరోనా నిబంధనలు ఉల్లగించారంటూ నారా లోకేష్ పై కేసు నమోదు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శ కోసం సూర్యారావు పేట కోర్టు సెంటర్ కి వెళ్లిన నారా లోకేష్. ఎపిడమిక్ డిసిజెస్ యాక్ట్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితరుల పై కేసు నమోదు.

* స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు ఎస్‌ఎన్‌బీ పేర్కొంది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విట్జర్లాండ్‌ల్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు వెల్లడించింది. 2019లో 6 వేల625 కోట్ల రూపాయలుగా ఉన్న భారతీయుల సంపద ఆమాంతం పెరిగినట్లు వివరించింది. 2011 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. భారతీయులు దాచుకున్న సంపద అత్యధికంగా 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాన్సులుగా ఉన్నట్లు తెలిపింది.

* వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. కొడంగ‌ల్ శివారులోని ఎల్ల‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఎదురెదురుగా వ‌చ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు. హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క వైపు వెళుతున్న వాహ‌నం ఎదురుగా వ‌చ్చిన మ‌రో కారును ఢీకొంది. స్థానికులు స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను వాహ‌నాల నుంచి బ‌య‌టికి తీశారు. మృతుల‌ను అబ్దుల్‌, ర‌షీద్‌, అమీర్, మౌలానా బేగంగా గుర్తించారు. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

* వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. హ‌న్మ‌కొండ నుంచి భూపాల‌ప‌ల్లికి వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులో ఉన్న 20 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రో 10 మంది స్ప‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. లారీ అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

* మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ వద్ద బాలిక‌(17) అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందింది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌క్కన‌ ప‌డి ఉన్న బాలిక‌ మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దుండ‌గులు హ‌త్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన బాలిక‌ ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన‌ట్లు చెబుతున్నారు. బాలిక‌ను పోచారం రాజీవ్ గృహక‌ల్ప కాల‌నీ వాసిగా గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లిని ఏసీపీ శ్యాంప్ర‌సాద్‌రావు ప‌రిశీలించారు. బాలిక‌ది హ‌త్యా? ఆత్మ‌హ‌త్య? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.