ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) సోమవారం నుంచి తెలంగాణకు బస్సులు నడపనుంది. సాయంత్రం 6 గంటలలోగా తెలంగాణలోకి ఆ బస్సు సర్వీసులు వెళ్లనున్నాయి. తెలంగాణలో బయలుదేరిన బస్సులు ఏపీలోని డిపోలకు సాయంత్రం 6 గంటల్లోపు చేరుకుంటాయి. సోమవారం నుంచి 120 సర్వీసులు నడిపేలా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచనున్నారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులు పునరుద్ధరించలేదు. ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సడలింపు ఉండటంతో దాదాపు అన్నీ ఉదయం సర్వీసులే నడపనున్నారు.
తెలంగాణాకు ప్రారంభమైన APSRTC సేవలు
Related tags :