ఊదా, నలుపు రంగుల మిశ్రమంతో మిలమిలా మెరుస్తూ.. రుచికి కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
* చిన్నా, పెద్దా, మధుమేహులు, ఊబకాయులు… ఇలా అందరూ తినొచ్చు.
* ఈ పండు కాస్త వగరుగా ఉంటుంది. దీంట్లో గాలిక్ యాసిడ్ కాస్త ఎక్కువ పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. ఈ పండులో యాంథోసయనిన్స్ అనే రసాయనాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి మధుమేహులూ తినొచ్చు.
* వాంతులు, వికారంగా ఉన్నప్పుడు వీటిని తింటే తగ్గుముఖం పడతాయి.
* ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.
* నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* నీటి వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లు ఈ పండ్లు తింటే తగ్గుముఖం పడతాయి.
* నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి.