NRI-NRT

ఎన్నారై ఆసుపత్రిని ₹650కోట్లకు అమ్మేసిన ముక్కామల-తాజావార్తలు

Dr. Mukkamala Apparao NRI Hospital Sold To Megha Krishna Reddy For 650Cr

* మెఘా క్రిష్ణా రెడ్డి కొత్త డీల్ కుదిరింది.విజయవాడ, గుంటూరు నడుమ భారీ ఆస్పత్రి కైవసం.మరో మూడు రోజులలో ఆసుపత్రి పేరు మార్పు కు రంగం సిద్ధం..సీఈఓ గా మాజి ఐ ఏ ఎస్ పి వి రమేష్ రానున్నారు?పోలవరం కొత్త కాంట్రాక్టర్ మెఘా కృష్ణా రెడ్డి భారీ మెడికల్ కాలేజీ,ఆస్పత్రిని కొనుగోలు చేసినట్లు సమాచారం.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న మెఘా కృష్ణా రెడ్డి వైద్య రంగంలోకి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.ఏపీలోని విజయవాడ – గుంటూరు మధ్య మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆస్పత్రి కొనుగోలు చేశారు.ఎన్నారై మెడికల్ కాలేజీ, ఆస్పత్రి కొనుగోలుకు సుమారు రూ.650 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం.ఎన్నారై ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ముక్కామల అప్పారావు ఇప్పటి వరకూ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.మేనేజ్‌మెంట్‌లో తలెత్తిన విభేదాల కారణంగా ఇరువర్గాలు పోలీస్ కేసులు పెట్టుకున్నాయి.కోర్టుల్లో కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు డాక్టర్ ముక్కామల అప్పారావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.సుమారు 250 ఎంబీబీఎస్,150 పీజీ సీట్లున్న ఎన్నారై కళాశాలను 650 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.అయితే మెఘా సంస్థ కొనుగోలు చేసినా నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా డాక్టర్ ముక్కామల చూసుకోవచ్చని తెలుస్తోంది.

* శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు.మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు.మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు.

* అనంతపురం నగరంలోని రామచంద్రానగర్ నందు ఏర్పాటు చేసిన IIFL గోల్డ్ లోన్ బ్యాంక్ ను సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు ప్రారంభించారు. కార్యక్రమంలో నగర పాలకసంస్థ మేయర్ మహమ్మద్ వసీం గారు,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

* ఏపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఉదయం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన నలుగురు వైసీపీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు.

* ఏపీలో హెల్త్ సిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన జగన్ సర్కార్.రాష్ట్రంలో 15 చోట్ల హెల్త్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ప్రతిపాదనలు.హెల్త్ సిటీల కోసం స్థలాలను గుర్తించిన వైద్యారోగ్యశాఖ.

* చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,86,116 మంది లబ్దిదారులకు రూ.34,896.75 కోట్లు పంపిణి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* సంగం డెయిరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.సంగం డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని ఏజీ వాదనలు వినిపించారు.తమకు సోదాలు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఏజీ కోరారు.తాము ప్రభుత్వానికి సహకరిస్తామని ధూళిపాళ్ల తరుపు న్యాయవాది పేర్కొన్నారు.తదుపరి విచారణ హైకోర్టు ఈనెల 28కు వాయిదా వేసింది.