DailyDose

ఇద్దరు ఏపీ IAS అధికారులకు వారం జైలుశిక్ష-నేరవార్తలు

ఇద్దరు ఏపీ IAS అధికారులకు వారం జైలుశిక్ష-నేరవార్తలు

* ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష – చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు వారం జైలు శిక్ష విధించిన హైకోర్టు – కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం – 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు – అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించిన హైకోర్టు – ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ – వారం రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు

* మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు డిమాండ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ క్లయింట్‌ ఎవరు.. ఆడిటింగ్‌ జరిగితే నిందితులెవరు? అని ప్రశ్నించారు. ఆడిటింగ్‌ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదన్నారు. ‘మాన్సాస్‌ ట్రస్ట్‌ వివరాలను వైకాపా నేతలు ఎందుకు అడిగారు?. విజయ సాయి, బొత్స ట్రస్టు ఈవోలను ఎందుకు అడిగారు? ’ అని అశోక్‌ గజపతి రాజు ప్రశ్నించారు.

* జర్నలిస్టు రఘుపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేసిన తీరుపై బీసీ కమిషన్ ఘాటుగా స్పందించింది. కమిషన్ నోటీసులతో విచారణకు హజరైన అడిషనల్ కలెక్టర్ పద్మజా రాణి, డీఎస్పీ రఘుపై ప్రశ్నల వర్షం కురిపించింది.

* కృష్ణాజిల్లా…వీడిన ఆగిరిపల్లి పిల్లల మిస్సింగ్ మిస్టరీలో విషాదం.చెరువులో మృతదేహాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు.ఈతకు వెళ్లి చనిపోయారా?ఎవరైనా హత్య చేశారా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* నవనీత్‌ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట.★ అమరావతి లోక్‌సభ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్‌ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.★ ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.★ ఈ నెల 8న బాంబే హైకోర్టు నవనీత్‌ కౌర్‌ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.★ అయితే, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నవనీత్‌ కౌర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.★ ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ వినీత్‌ శరన్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్.. మహారాష్ట్రతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన ఆనంద్‌రావ్‌ అద్సులేకు నోటీసులు జారీచేసింది.

* మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.