రాష్ట్రంలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. జగన్ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు తెదేపా క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధమవుతోందని ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆయన మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ‘అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం లేక రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగారు. జాబ్ క్యాలెండరు పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండరును విడుదల చేశారు. ఏటా రూ.లక్షల ఖర్చుతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న లక్షలాది నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారు. గ్రూప్-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయి. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలోనూ జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
నేను నిరూపిస్తా
Related tags :